సముద్ర స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి

19చూసినవారు
సముద్ర స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
AP: బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూర్యలంక వద్ద సముద్ర స్నానానికి వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన షేక్‌ వలీ (40)గా గుర్తించారు. విహారయాత్ర కోసం 15 మంది బృందం సూర్యలంకకు వచ్చింది. లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో షేక్‌ వలీ సముద్రంలో కొట్టుకుపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్