రూ. 30 వేల అప్పు కోసం సహోద్యోగిని చంపేసిన వ్యక్తి

30చూసినవారు
రూ. 30 వేల అప్పు కోసం సహోద్యోగిని చంపేసిన వ్యక్తి
గుజరాత్‌లోని సూరత్‌లో రూ. 30,000 అప్పు వివాదం కారణంగా ఒక వ్యక్తి తన సహోద్యోగిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఒడిశాకు చెందిన సంజిత్ (36)ని, అదే ప్రాంతానికి చెందిన సుచిత్‌కుమార్ (54) నవంబర్ 3న తన ఇంటికి పిలిచి, భార్య సమక్షంలోనే హత్య చేశాడు. అనంతరం మొండెంను శ్మశానవాటికలో పడేసి, మరుసటి రోజు రాత్రి తలను వేరు చేసి 3 కి.మీ దూరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో వదిలేశాడు. తలలేని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్