ఎయిర్
ఇండియా విమానంలోని చిన్న వాష్‌రూంలో ఇమడలేక ఓ 6.8 అడుగుల వ్యక్తి ఇబ్బంది పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రావెల్ బ్లాగర్ జంట రేమండ్, రమీసా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విమానాలను ఎయిర్
ఇండియా తయారు చేయదని, బోయింగ్, ఎయిర్‌బస్ వంటి సంస్థలే వాష్‌రూంల పరిమాణాన్ని నిర్ణయిస్తాయని పలువురు పేర్కొన్నారు. మరికొందరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో చర్చ బాడీ షేమింగ్ వైపు మళ్లింది.