వీడియోలు


తెలంగాణ
‘యేష నాగుల కట్టమీద’ సింగర్ ప్రభావతి గురించి తెలుసా?
Sep 24, 2026, 12:09 IST/

‘యేష నాగుల కట్టమీద’ సింగర్ ప్రభావతి గురించి తెలుసా?

Sep 24, 2026, 12:09 IST
TG: నాని 'ప్యారడైజ్'లోని ‘యేష నాగుల కట్టమీద’ సాంగ్‌‌తో సింగర్ ప్రభావతి ఆకట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రభావతి.. భర్త సందీప్ కుమార్ ప్రోత్సాహంతో 2020లో గర్భవతిగా ఉన్న సమయంలోనే ‘సిటాపటా సినుకులకు’ పాటతో గాయని, రచయిత, నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 2 వేలకుపైగా పాటలు పాడారు. ‘రాను బొంబాయికి రాను’, ‘కోమటోళ్ల ఓ ఎంకటి’, ‘నీ మెడలా నా మెడలా నిమ్మల దండ’ సహా ఎన్నో పాటలు గుర్తింపు తెచ్చాయి. ‘రాను బొంబాయికి రాను’ పాటతో సినిమా అవకాశం అందుకున్నారు. తాజాగా అనిరుధ్ సంగీతంలో ‘ది ప్యారడైజ్’లో పాడిన‘యేష నాగుల కట్టమీద’ పాట సెన్షేషన్ క్రియేట్ చేసింది.