
బెల్లంపల్లి బంగారు మైసమ్మ ఆలయంలో ఘనంగా మహా చండీయాగం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో శుక్రవారం మహా చండీయాగం మరియు హోమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గేల్లి రాజలింగం దంపతులు, మల్రాజుల శ్రీనివాసరావు దంపతులు మరియు నాతరి స్వామి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు రేణికుంట్ల ప్రవీణ్, దావ రమేష్, బండి ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.





















