Sep 15, 2026, 14:09 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
అటవీ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన అధికారులు
Sep 15, 2026, 14:09 IST
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలోని వేమనపల్లి మండలం నాగారం గ్రామంలోని నార్త్ బీట్లో 15 హెక్టార్లలో చేపట్టిన లిమ్ ప్లాంటేషన్ పనులను బెల్లంపల్లి ఎఫ్డీఓ విజయ్ కుమార్, కుశ్నెపల్లి అటవీ క్షేత్రాధికారి దయాకర్ మంగళవారం పర్యవేక్షించారు. ప్లాంటేషన్ పనుల పురోగతిని పరిశీలించి, అటవీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. మొక్కల సంరక్షణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ శ్రీనివాస్, ఎఫ్బీఓ బి. రాజు పాల్గొన్నారు.