Sep 18, 2026, 16:09 IST/
గణపతి నిమజ్జనం.. డీజే సౌండ్కు మహిళ మృతి
Sep 18, 2026, 16:09 IST
AP: కర్నూలు సమీపంలోని ఇ.తాండ్రపాడులో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ డీజే సౌండ్కు 36 ఏళ్ల శివమ్మ అనే మహిళ మృతి చెందింది. అధిక శబ్దం వల్లే ఆమె మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీజేల అధిక శబ్దాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ విషాదం జరిగింది.