
జన గణనలో ఓబీసీ కాలం చేర్చి యూనిక్ కోడ్ పెట్టాలని నిరసన
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని సీసీ కార్నర్ చౌరస్తాలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. జనగణనలో ఓబీసీ కాలం చేర్చి కులానికొక యూనిక్ కోడ్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీ బీసీ కుల గణన చేపడతామని చెప్పి మాట మార్చారని, బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా దాటవేస్తున్నారని ప్రశ్నించారు. ఇండియా కూటమి కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
























