మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 6లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిళ్ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు కంటి
పరీక్షలు నిర్వహించి శుక్లాల సమస్య ఉన్నవారిని గుర్తించారు. అవసరమైన వారికి రేకులలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. కేశెట్టి శ్రీనివాస్, గుగ్గుల చక్రధర్ రావు, దొంతుల మురళీధర్, నేరెళ్ల శ్రీనివాస్, కాసం మల్లికార్జున్, చిట్టి గిరిబాబు, తదితరులు, పాల్గొన్నారు.