చిన్నారిపై అడవి పంది దాడి

1496చూసినవారు
చిన్నారిపై అడవి పంది దాడి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని భీమారం మండల ఖాజీపల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి స్ఫూర్తి రాణిపై అడవి పంది సోమవారం హఠాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే 108కు ఫోన్ చేసి మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్