Sep 26, 2026, 08:09 IST/
టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్ ఫలితాలు విడుదల.. 15,749 మంది అర్హత
Sep 26, 2026, 08:09 IST
తెలంగాణ టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 24,986 మంది దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. పేపర్-1లో 68.76%, పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ లో 73.60%, పేపర్-2 సోషల్ లో 67% మంది అర్హత సాధించారు.