కాసిపేట మండలం - Kasipeta Mandal

మంచిర్యాల జిల్లా
గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే కిడ్నీ తొలగింపు?
Sep 08, 2026, 00:09 IST/

గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే కిడ్నీ తొలగింపు?

Sep 08, 2026, 00:09 IST
TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని అర్పిత నర్సింగ్ హోమ్‌లో గర్భసంచి క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్న 60 ఏళ్ల కమలమ్మకు, వైద్యులు తెలియకుండానే ఆమె కిడ్నీని తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌లో స్కానింగ్ చేయించుకోగా.. ఒకే కిడ్నీ ఉందని తెలియడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు. నర్సింగ్‌హోం వైద్యులు క్యాన్సర్ గడ్డలను తొలగించే క్రమంలో కిడ్నీ కోతకు గురైందని వివరించారు. బాధితుల ఫిర్యాదుతో ఈ నెల 3న పోలీసులు కేసు నమోదు చేసి, డీఎంహెచ్‌వో నేతృత్వంలో విచారణ చేపట్టారు.