
పవన్ కళ్యాణ్ తో భేటీ మంచిర్యాల రాజకీయాలపై రాజ్ కిరణ్ చర్చ
హైదరాబాద్లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ను జనసేన పెద్దపల్లి & ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ డా. చుంచు రాజ్ కిరణ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు పార్టీ నిర్మాణం మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలకమైన చర్చలు జరిగాయి.


































