
యెమెన్‌లో హౌతీల దాడి.. 53 మంది సైనికులు మృతి
యెమెన్‌లోని షాబ్వా ప్రావిన్స్‌లో గల అల్-అలమ్ మిలటరీ క్యాంపుపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదార్లు మూడు బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడి చేశారు. ఈ ఘటనలో శిక్షణ పొందుతున్న 53 మంది సైనికులు మరణించగా, మరో 200 మంది వరకు గాయపడ్డారని మిలటరీ అధికారులు తెలిపారు. బాధితులంతా ఇటీవల ఆర్మీలో చేరిన వారేనని రషద్ అల్ అలిమి వెల్లడించారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో భద్రతను మెరుగుపరచాలని యెమెన్ ప్రభుత్వాన్ని, సౌదీ కూటమిని కోరారు.




