TG: పాత పెన్షన్ స్కీమ్(OPS)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర CPS ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ వెల్లడించారు. అత్యవసర సేవలకు 45,000 మందిని మినహాయించి, మిగతా 2.15లక్షల మంది సామూహిక సెలవులో పాల్గొంటారని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మ దీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.