బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు

29చూసినవారు
బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు
TG: భద్రాద్రి కొత్తగూడెం(D) ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి (M)లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. టేకులపల్లి(M) దాసతండాలోని హరిప్రియ నాయక్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జి చాడ కిషన్ రెడ్డి, మాజీ MLA బానోత్ హరిప్రియ నాయక్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్‌లో చేరారు.

సంబంధిత పోస్ట్