రష్యాలోని కమ్‌చట్కా ప్రాంతంలో శనివారం 6.7 తీవ్రతతో భారీ
భూకంపం సంభవించింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మెడియాలో వైరల్ అవుతున్నాయి. భూమి కంపించడంతో వీధుల్లోని రోడ్లకు బీటలు పడగా కార్లు, భవనాలు ఊగిపోయాయి. యెలిజివో ప్రాంతానికి 62km దూరంలో, 188km లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ భూకంపంతో సంభవించిన ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.