
జమ్మూ కాశ్మీర్లో చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. శనివారం తెల్లవారుజామున ఎల్వోసీ వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించిన సైన్యం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పులు జరిగాయి. మిగిలిన వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.




