ఢిల్లీలోని ప్రసిద్ధ కరోల్ బాగ్ గఫ్ఫార్ మార్కెట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 13వ బ్లాక్‌లోని 'పురి ప్లాజా' కాంప్లెక్స్‌లోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో మొదలైన మంటలు వేగంగా పక్క దుకాణాలకు వ్యాపించాయి. ఇరుకైన సందులు, ఎలక్ట్రానిక్ సామాగ్రి కారణంగా మంటలు తీవ్రరూపం దాల్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించి 22 ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదం సమయంలో మార్కెట్ మూసివేసి ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.