నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం (VIDEO)

11చూసినవారు
మహారాష్ట్రలోని నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉరాన్‌లోని వేష్వి గ్రామంలో ఉన్న ప్లాటినం లాజిస్టిక్స్ సొల్యూషన్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్