మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోలాపూర్ అక్కల్కోట్ రోడ్డులో ఉన్న అజింక్య తారా హోటల్ పార్కింగ్‌లో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లో నిలిపి ఉంచిన 8-10 వరకు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.