హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చోటుచేసుకున్న అవినీతిపై ఏసీబీ (ACB) జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ సమయంలో బెడ్ల కేటాయింపు కోసం ఒక్కో బెడ్‌కు రూ.లక్ష చొప్పున లంచం వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్, ప్రశాంత్‌తో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు క్యాంటీన్లు, మెడికల్ షాపులు, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ టెండర్లలో కూడా భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది.