వినోద రంగ దిగ్గజం వాల్ట్ డిస్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థలో దాదాపు 20 శాతం వ్యయాలను తగ్గించుకోవాలని కీలక మేనేజర్లకు ఇప్పటికే సూచించినట్లు సమాచారం. ఖర్చుల నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపుతోపాటు ఇతర పొదుపు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. థీమ్ పార్కులు, టీవీ నెట్వర్క్లు, మూవీ స్టూడియో విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని కథనాలు పేర్కొన్నాయి.