Sep 22, 2026, 06:09 IST/
స్కూల్ బస్సు ఢీ కొని మూడేళ్ల చిన్నారి మృతి
Sep 22, 2026, 06:09 IST
AP: పల్నాడు జిల్లా ముప్పాళ్ మండలం లంకెలకూరపాడులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు నితిన్ మృతి చెందాడు. అన్న సిద్ధార్థ్ ను బస్సు ఎక్కించే సమయంలో తల్లితో పాటు రోడ్డుపైకి వచ్చిన నితిన్ ను గమనించలేక డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఈ దుర్ఘటనలో నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం డ్రైవర్ రవి పరారయ్యాడు.