చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

84చూసినవారు
చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరసంఘం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన పిచకుంట్ల సంగప్ప(45) ఆదివారం తెల్లవారుజామున చేపలు పట్టడానికి చెరువులో దిగి నీట మునిగి మృతి చెందాడు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో, అతని కొడుకు, కోడలు స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు చెరువు వద్దకు వెళ్లి చూడగా, సంగప్ప బట్టలు కనిపించడంతో అనుమానంతో మృతదేహాన్ని వెలికితీశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్