మెదక్ నియోజకవర్గం - Medak Constituency

ఎల్లమ్మ భూమికి ఎసరు! అక్రమంగా పట్టా చేసుకొని పదేళ్లుగా రైతుబంధు

దేవుడి భూమినే అక్రమంగా పట్టా చేసుకున్నారంటూ కల్వకుంట గౌడ కులస్తులు ఆరోపించారు. నిజాంపేట మండలం కల్వకుంటలోని ఎల్లమ్మ దేవాలయానికి చెందిన మూడు ఎకరాల భూమిని గ్రామానికి చెందిన చింతల లక్ష్మి భర్త నాగరాజు, చింతల పుష్ప భర్త యాదగిరి తమ పేరిట నమోదు చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేసి, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. గత పదేళ్లుగా ఈ భూమికి సంబంధించిన రైతుబంధు నిధులు సైతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆరోపిస్తూ, చెల్లింపులు నిలిపివేయాలని వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

వీడియోలు

మెదక్ జిల్లా
ఎల్లమ్మ భూమికి ఎసరు! అక్రమంగా పట్టా చేసుకొని పదేళ్లుగా రైతుబంధు
Oct 16, 2026, 01:10 IST/మెదక్ నియోజకవర్గం
మెదక్ నియోజకవర్గం

ఎల్లమ్మ భూమికి ఎసరు! అక్రమంగా పట్టా చేసుకొని పదేళ్లుగా రైతుబంధు

Oct 16, 2026, 01:10 IST