
ఘనంగా అష్టలక్ష్మి హోమం
వెల్దుర్తి మండలం శేరిల గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మల్లికార్జున దేవస్థానంలో స్వాములు ఎంతో భక్తిశ్రద్ధలతో నవగ్రహ అష్టలక్ష్మి హోమం పడిపూజ కార్యక్రమం గురువారం నిర్వహించారు. తర్వాత కోమిరిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
























