Sep 11, 2026, 02:09 IST/
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2 డీఏలకు గ్రీన్సిగ్నల్!
Sep 11, 2026, 02:09 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రెండు డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదిక సహా పలు సమస్యలను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నందున ఆరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.