ఎల్దుర్తి మండలం - Yeldurthy Mandal

మెదక్ జిల్లా
విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
Sep 25, 2026, 03:09 IST/మెదక్ నియోజకవర్గం
మెదక్ నియోజకవర్గం

విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

Sep 25, 2026, 03:09 IST
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మాగౌడ్‌, ప్రధానోపాధ్యాయుడు సత్యంరెడ్డి అన్నారు. నిజాంపేట మండలంలోని నస్కల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం హైస్కూల్‌ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్‌లు అందిస్తూ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మమత, ఉపసర్పంచ్‌ దేవరాజ్‌, రహీం, సులేమాన్ తదితరులు ఉన్నారు.