జహీరాబాద్ నియోజకవర్గం - Zahirabad Constituency

RTI విచారణకు ఆర్‌డీఓ డుమ్మా.. జహీరాబాద్‌లో పిటిషనర్ నిరసన

RTI విచారణకు ఆర్‌డీఓ డుమ్మా.. జహీరాబాద్‌లో పిటిషనర్ నిరసన

RTI అప్పీల్ విచారణకు అధికారులు గైర్హాజరు కావడంపై ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎండీ ఖాజా మొయినొద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం జహీరాబాద్ ఆర్‌డీఓ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ నిర్ణయించగా, ఆయన హాజరై 4: 30 వరకు వేచి చూశారు. అయినప్పటికీ ఆర్‌డీఓ గానీ, తహసీల్దార్ కార్యాలయ అధికారులు గానీ రాలేదు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసి, మళ్లీ సమయమిచ్చి రాకపోవడం సమాచారాన్ని తొక్కిపెట్టేందుకేనని ఆయన మండిపడ్డారు. బాధ్యులపై కలెక్టర్ తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వీడియోలు


సంగారెడ్డి జిల్లా
సంవత్సరంలో ఒక్కసారే తెరిచే ఆలయం.. ఏడాది తర్వాత కూడా వాడిపోని పూలు, చెడిపోని ప్రసాదం!
Oct 25, 2026, 11:10 IST/

సంవత్సరంలో ఒక్కసారే తెరిచే ఆలయం.. ఏడాది తర్వాత కూడా వాడిపోని పూలు, చెడిపోని ప్రసాదం!

Oct 25, 2026, 11:10 IST
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉన్న హసనాంబ ఆలయం ఎన్నో ప్రత్యేక విశ్వాసాలకు ప్రసిద్ధి చెందింది. దీపావళి సమయంలో మాత్రమే తెరుచుకునే ఈ ఆలయంలో ద్వారాలు మూసిన తర్వాత కూడా దీపం వెలుగుతూనే ఉంటుందని, అమ్మవారికి సమర్పించిన పూలు వాడిపోకుండా, ప్రసాదం చెడిపోకుండా ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఆలయంలోని పుట్ట ఆకారపు రాయి ప్రతి ఏడాది వరి గింజ పరిమాణంలో అమ్మవారి విగ్రహం వైపు కదులుతుందని, అది అమ్మవారి పాదాలను తాకినప్పుడు కలియుగం ముగుస్తుందని స్థానికుల విశ్వాసం. భక్తులు తమ కోరికలను చీటీలపై రాసి అమ్మవారి ముందు ఉంచి మొక్కులు చెల్లించుకుంటారు. #Hidden Secrets of Telugu Temples