
మయన్మార్‌లో వైమానిక దాడి.. 49 మంది మృతి
మయన్మార్‌లోని పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో, క్యాక్టావ్ టౌన్‌షిప్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం సైన్యం జరిపిన వైమానిక దాడిలో 49 మంది మృతి చెందారు. మరో 58 మంది గాయపడ్డారు. మయన్మార్ సైన్యంపై పోరాడుతున్న అరాకాన్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దాడిలో వ్యాపారులు, కొనుగోలుదారులు, పాదచారులు మరణించినట్లు తెలిపింది. ఈ దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నాయి, వాహనాలు కాలిపోయాయి. మయన్మార్ సైన్యం ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.




