మెటా సంస్థ చైనాకు చెందిన ఫోరియర్ రోబోటిక్స్ స్టార్టప్‌తో కలిసి ‘మ్యాక్స్’ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఐదు అడుగుల ఎత్తు, 48 కిలోల బరువున్న ఈ రోబో మనుషుల గొంతును గుర్తించి, చేతి సైగలను అర్థం చేసుకుని స్పందించగలదు. ఎన్విడియా జెట్సన్ థోర్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే దీన్ని ప్రస్తుతం పరిశోధనల కోసమే రూపొందించారు. ఇప్పటికే రెండో వెర్షన్ అభివృద్ధిపైనా మెటా దృష్టి పెట్టింది.