సుమారు 36 గంటల సుదీర్ఘ అంతరాయం తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అవుట్‌లుక్, టీమ్స్ వంటి సేవలను పునరుద్ధరించినట్ల సంస్థ వెల్లడించింది. యూజర్లు ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా ఈమెయిల్స్‌తో పాటు ఇతర సేవలను యథావిధిగా యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం రాత్రి నుంచి ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా 70కి పైగా దేశాలు ప్రభావితం అయ్యాయి.