
VIDEO: మళ్లీ సీఈఓగా జెన్సన్ హువాంగ్.. ఘన స్వాగతం పలికిన ఉద్యోగులు
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ కేవలం 11 రోజుల వ్యవధిలోనే తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే మళ్ళీ పగ్గాలు చేపట్టడం విశేషం. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న హువాంగ్‌కు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గతంలో జరిగిన తప్పిదాలకు క్షమాపణలు చెబుతూ, ఈసారి మరింత మెరుగైన నాయకత్వాన్ని అందిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




