అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతుగా భారీగా నిధులు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్‌కు
ఫలితాలు నిరాశ కలిగించాయి. తాను మద్దతిచ్చిన అభ్యర్థులు ఓడిపోవడంతో ‘స్పేస్ లేజర్లతో ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం ఫలించలేదనుకుంటా’ అంటూ ఎక్స్‌లో సెటైర్ వేశారు. టెక్సాస్‌లో డెమోక్రాట్ల విజయంపై స్పందిస్తూ అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల కోసం మస్క్ 500 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు
అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.