మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పుల కలకలం రేపింది. ఇంఫాల్-ఉఖ్రుల్ రహదారిపై రెండు వాహనాలపై కాల్పులు జరిపారు. అనుమానిత మిలిటెంట్ల దాడిలో నలుగురు మృతి చెందారు. ఉఖ్రుల్ జిల్లాలోని టీఎం కసోమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.