మొక్కలు నాటడం సులభమే అయినా, వాటిని పెంచడం కష్టమని చాలామంది భావిస్తారు. ఈ సమస్యను అధిగమించడానికి, గార్డెనింగ్‌ను సరళతరం చేసే కొన్ని మినీ గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. కుండీలను సులభంగా తరలించడానికి వీల్స్‌తో కూడిన ప్లాంట్ స్టాండ్లు, మొక్కలకు క్రమంగా నీరందించే సెల్ఫ్ వాటరింగ్ స్పైక్‌లు, మొక్కలకు సురక్షితంగా సపోర్ట్ ఇచ్చే రీయూజబుల్ ప్లాంట్ టై టేప్‌లు వంటివి రూ.200 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ గాడ్జెట్లు గార్డెనింగ్‌ను మరింత ఆనందదాయకంగా మార్చడంలో సహాయపడతాయి.