జీడీఎన్ సినిమాపై మంత్రి లోకేష్ ప్రశంసలు

1చూసినవారు
జీడీఎన్ సినిమాపై మంత్రి లోకేష్ ప్రశంసలు
AP: పారిశ్రామికవేత్త జీడీ నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన 'జీడీఎన్' బయోపిక్‌ను మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. జీడీ నాయుడును భారతదేశపు 'ఎడిసన్'గా అభివర్ణిస్తూ, ఆయన ఆవిష్కరణల పట్ల అంకితభావం, పారిశ్రామికవేత్తగా సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని మంత్రి లోకేష్ అన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని, ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి సినిమాలు రావడం ఆనందంగా ఉందని, నేటి యువతరం వీరి గురించి తెలుసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్