కోల్కతాలో నదిలో పడి కొట్టుకుపోతున్న శునకాన్ని పశ్చిమ బెంగాల్ మంత్రి ఇంద్రనీల్ ఖాన్ కాపాడారు. ఛత్ పూజ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన.. శునకం ప్రాణాల కోసం పోరాడుతుండటాన్ని గమనించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మూడు బోట్లతో వెళ్లిన సిబ్బంది దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చలితో వణుకుతున్న శునకానికి మంత్రి టవల్ కప్పి, పాలు అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.