TG: మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్లైమాక్స్కు చేరుకుంది. ఏ క్షణమైనా అధిష్టానం వేటు వేసే ఛాన్స్ ఉంది. అయితే సురేఖను తప్పిస్తే బీసీల ఆగ్రహానికి గురికాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు గద్వాల విజయలక్ష్మి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరిలో ఒకరికి కొండా సురేఖ స్థానంలో మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అలాగే పనిచేయని మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే పూర్తిస్థాయి విస్తరణ కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.