కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా రానున్నాడు. దీంతో చందమామ సాధారణం కంటే 14% పెద్దదిగా, 30% వరకు ప్రకాశవంతంగా కనువిందు చేయనుంది. సాధారణ పౌర్ణమితో పోలిస్తే చంద్రుడు మరింత పెద్దగా కనిపించడంతో దీనిని 'బీవర్ సూపర్ మూన్' అని పిలుస్తారు. సాయంత్రం చంద్రోదయ వేళ 5.01PM తర్వాత తూర్పు దిక్కున ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు