రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ ఎస్‌ఐకి గాయాలు

34చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ ఎస్‌ఐకి గాయాలు
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్​ ఎస్‌ఐ సతీశ్​ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం విధులు నిర్వహించడానికి వెళ్తుండగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి రామగిరి వద్ద బైకు అదుపుతప్పింది. ఈ క్రమంలో కిందపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్