బతుకమ్మను మిస్ అవుతున్నా.. సింధు పోస్ట్

10చూసినవారు
బతుకమ్మను మిస్ అవుతున్నా.. సింధు పోస్ట్
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు, ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను మిస్ అవుతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. టోర్నీ షెడ్యూల్ కారణంగా ఈ సంబరాల్లో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. గత ఏడాది వేడుకల్లో పాల్గొన్న జ్ఞాపకాలను, ఫొటోలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా బతుకమ్మ రంగులు, పూల సౌందర్యాన్ని మిస్సవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సింధు విదేశాల్లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్