యూపీలోని మిర్జాపూర్
బీజేపీ ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. వింధ్యాచల్ సమీపంలోని అకోఢి గ్రామం వద్ద గల అండర్పాస్లో నీరు, బురద పేరుకుపోవడంతో ఎమ్మెల్యే వాహనం అందులో తీవ్రంగా ఇరుక్కుపోయింది. చివరకు ట్రాక్టర్ సాయంతో కారును బయటకు లాగాల్సి వచ్చింది. వర్షాకాలం అంతా ఈ అండర్పాస్ నీటిముంపుతో ప్రజలు పడుతున్న అవస్థలను చూపిస్తూ, స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.