చెంపదెబ్బకు ఎమ్మెల్యే కూతురి క్షమాపణ

39చూసినవారు
కర్ణాటకలో మహిళా ఎస్‌ఐ సవితా పాటిల్‌ను చెంపదెబ్బ కొట్టిన కేసులో తుమకూరు రూరల్‌ ఎమ్మెల్యే సురేష్‌గౌడ కుమార్తె ఐశ్వర్య క్షమాపణ కోరింది. ఆగస్టు 12న మండ్యలోని ఓ ఆలయంలోకి వెళ్లే సమయంలో ఎస్‌ఐ అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఐశ్వర్య ఎస్‌ఐను కొట్టగా.. ఎస్‌ఐ కూడా ఆమెపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఐశ్వర్య బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించి క్షమాపణ చెప్పాలని ఆదేశించడంతో.. ఆమె వీడియో ద్వారా క్షమాపణలు తెలిపింది.

సంబంధిత పోస్ట్