రాత్రివేళ రైళ్లలో మొబైల్‌ ఛార్జింగ్‌పై నిషేధం

17చూసినవారు
రాత్రివేళ రైళ్లలో మొబైల్‌ ఛార్జింగ్‌పై నిషేధం
రైళ్లలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లను స్విచ్‌ఆఫ్ చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముంబయి లోకల్ రైలులో పవర్ బ్యాంక్ పేలిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రివేళల్లో ఓవర్‌హీటింగ్, షార్ట్ సర్క్యూట్‌ల వల్ల జరిగే అగ్నిప్రమాదాలను నివారించేందుకు, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీనిని పర్యవేక్షించేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్