మొబైల్ ఫోన్ పేలి.. ఓ వ్యక్తి మృతి

2చూసినవారు
ఉత్తరప్రదేశ్ ముజప్ఫర్‌నగర్‌లోని రహమత్‌పూర్ గ్రామానికి చెందిన వికాస్ అంతల్ (40) మొబైల్ ఫోన్ పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. తన తల్లిని మాజ్రా గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద దింపి తిరిగి వస్తుండగా, అతని జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంతో బైక్ అదుపు తప్పి కింద పడటంతో వికాస్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్