మోదీకి 'భారతరత్న' ఇవ్వాలి: బీజేపీ ఎంపీ

8చూసినవారు
మోదీకి 'భారతరత్న' ఇవ్వాలి: బీజేపీ ఎంపీ
పంజాబ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ విక్రమ్‌జీత్ సాహ్నీ హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి భారతరత్న పురస్కారం అందించాలని ఆయన కోరారు. G20, BRICS కూటముల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత మోదీదని, గత 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న ప్రజాసేవ దృష్ట్యా ఈ పురస్కారానికి ఆయన అర్హుడని సాహ్నీ అభిప్రాయపడ్డారు. నెహ్రూ, ఇందిరా గాంధీలకు ఈ పురస్కారం ఇచ్చినప్పుడు మోదీకి ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. కాగా ఈయన ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరారు.

సంబంధిత పోస్ట్