డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు మోదీ.. ట్రంప్‌తో భేటీ!

72చూసినవారు
డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు మోదీ.. ట్రంప్‌తో భేటీ!
భారత ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో అమెరికాలో పర్యటించే అవకాశాలున్నాయి. డిసెంబర్ 14, 15 తేదీల్లో ఫ్లోరిడాలో జీ20 సదస్సు నేపథ్యంలో ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ కీలక ద్వైపాక్షిక భేటీ జరగొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రష్యా, ఇరాన్‌లపై అమెరికా విధించిన ఆంక్షలు, భారత్, చైనాలపై సుంకాల ముప్పు నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియోగోర్ ఈ భేటీ అవకాశాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్