AP: విశాఖ మధురవాడ పరిధిలో బీటెక్ సెకెండ్ ఇయర్ విద్యార్థి కర్రి జ్ఞానేశ్‌వర్మ (19) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిథిలాపురి వుడా కాలనీలో ఒంటరిగా ఉంటున్న అతడు గదిలో ఉరేసుకున్నాడు. బుధవారం పనిమనిషి గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా కోసం మీరు ఎంత చేశారు.. నేనేమీ చేయలేకపోయాను...నేను ఒక మూర్ఖుడిని.. ఎవరూ నా కోసం బాధపడొద్దు... అక్కా...లవ్‌యూ’ అంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మనసుతో ఎవరో ఆడుకున్నారని తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు.